ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు దేశ ప్రజలంతా ఏకతాటి మీద నిలవాలని దేశ ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన సతీమణి జ్యోతితో కలిసి తన నివాసంలో విద్యుత్ దీపాలు అన్ని ఆర్పేసి రాత్రి 9 గంటలకు 9నిమిషాల పాటు దీపాలు వెలిగించి దీప యజ్ఞం చేసి కరోనా పై పోరును ముందుండి నడిపిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కరోనా మీద దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు ప్రజలందరూ స్పందించి విపత్కర పరిస్థితుల్లోనూ భారతీయులంతా ఐకమత్యంతో ఉన్నారనే తమ దృఢ సంకల్పాన్ని దీపాల వెలుగుల్లో ప్రదర్శించారని అన్నారు.

ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని విధిగా పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు చీకట్లో దీపాలు వెలిగించి ఐక్యతా చాటిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.