సినీ క్రిటిక్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలతో హైలైట్ అయిన కత్తి మహేష్ వైసీపీలో చేరడానికి ఓ కండిషన్ పెట్టారు. శ్రీరెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకొంటారని ప్రచారం జరిగింది.

ఓ దశలో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ కూడా టాక్ వచ్చింది. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంపై శ్రీరెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మరిన్ని వివరాలు తెలిపాడు. ‘2019 ఎన్నికల సమయంలో వైసీపీ టికెట్ ఆశించా. సీటు కోసం ప్రయత్నం కూడా చేశా. ఆ పరిస్థితుల్లో కుదరదని చెప్పారు. అప్పుడు టికెట్ ఇచ్చి ఉంటే వైసీపీ కండువా కప్పుకొనేవాడిని. ఒకసారి కండువా కప్పుకొంటే పార్టీ ఏం చెప్పినా వినాలి. నా అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉండదు.

నా స్వతంత్రాన్ని నేను త్యాగం చేయలేను. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనేది నా ఆకాంక్ష. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాకు టికెట్ కన్‌ఫాం చేస్తే అప్పుడు వైసీపీ కండువా కప్పుకుంటా’ అని కత్తి మహేష్ తెలిపాడు.