అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే డిగ్రీ చదువుతోన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. అయితే ఈ పెళ్లిని భరించలేని వధువు తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమిళనాడు రాష్ట్రం కల్లకూరిచి నియోజకవర్గానికి చెందిన ప్రభు (35) ప్రేమ వివాహం చేసుకుని సోమవారం తుఫాను సృష్టించారు. అయితే తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ వధువు తండ్రి శాసనసభ్యుడి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. తరువాత, ఈ జంట బయటకు వచ్చి తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, తమ స్వంత ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని వివరించారు. దాంతో పోలీసులు దీనిని పట్టించుకోలేదు.

అయితే, ఎమ్మెల్యే వయసు 39, అమ్మాయికి 19 కావడంతో వివాదం రేగుతోంది. తాను వివాహం చేసుకున్న యువతిని గత పదేళ్లుగా ప్రేమిస్తున్నాని ఎమ్మెల్యే చెప్పడం పొంతనలేకుండా ఉంది. పదేళ్ల కిందట అంటే అమ్మాయికి 9 ఏళ్లు వయసు ఉంటుంది అప్పటి నుంచి అతను ప్రేమిస్తున్నాడా.? అదిసాధ్యమా.? అంత చిన్న వయసులో ఇష్టం ఎలా కలుగుతుందని వధువు తండ్రి స్వామినాథన్‌ ప్రశ్నిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే తన కుమార్తెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు ఇద్దరికి 20 ఏళ్లు తేడా ఉందని, పెళ్లికి ఒప్పుకోకపోతే తమని చంపుతామని ఎమ్మెల్యే బెదిరించాడని ఆరోపిస్తున్నాడు.