హనుమకొండ: కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. షెడ్యూల్ తెగల సంక్షేమ ఆశ్రమ పాఠశాల విధ్యార్థులు నడుమ చీఫ్ విప్ పిల్లలు దాస్యం కృషిక-కృష్ణవ్ భాస్కర్ లు కన్నయ్య-గోపికల వేషధారణలతో ఉట్టి కొట్టి చూపరులను కనువిందు చేశారు. చీఫ్ విప్ దంపతులు వినయ్ భాస్కర్-రేవతి దంపతుల సమక్షంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, క్యాంప్ కార్యాలయ సిబ్బంది, చిన్నారి కృష్ణయ్యలు, గోపికలు తదితరులు పాల్గొన్నారు.