టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని కవిత స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తమ కుటుంబమంతా క్వారంటైన్లో ఉందని, ఇతరులెవరూ తమరిని కలిసేందుకు రావద్దని కవిత తన ట్వీట్లో చెప్పుకొచ్చారు. నా భర్త అనిల్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో బాగానే ఉన్నారు. మా కుటుంబమంతా క్వారంటైన్‌లోనే ఉంది. ఇప్పట్లో మమ్మల్నెవరూ కలిసేందుకు వీలు లేదు. ఆఫీసు కూడా మూసివేశాం. క్వారంటైన్ నిబంధనలు ముగిసి పరిస్థితులు చక్కబడ్డాక ఆఫీసు తెరుచుకుంటుంది అని కవిత ట్వీట్ చేశారు.