రష్మి నేడు(మంగళవారం) నెటిజన్లతో చిట్‌చాట్‌ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్లు ఆసక్తికర, కాస్త ఇబ్బందికర ప్రశ్నలను రష్మిని అడిగారు. అయినా ఏమాత్రం తడుముకోకుండా రష్మి సమాధానమిచ్చింది. ఓ నెటిజన్ ‘ఒకవేళ ఎవరైనా మీరు కోరిన దానికంటే ఎక్కువ డబ్బిచ్చి ఒక రాత్రి తమతో గడపమంటే ఏం చేస్తావు?’ అని ప్రశ్నించారు. దీనికి రష్మి దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. 
‘నిజానికి అది అడగిన వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది’ అని చెప్పి షాక్ ఇచ్చింది. మరో నెటిజన్ ‘అవుసమ్ అప్పి అయితే యాక్సెప్ట్ చేస్తావా?’ అని ప్రశ్నించగా ‘కుదరదు అని చెప్తా’ అని సమాధానమిచ్చింది.

‘షూటింగ్‌లో మీకు ఇష్టమైన పార్ట్ ఏంటి?’ అని ప్రశ్నించగా. ‘లంచ్ బ్రేక్’ అని ఫన్నీ ఆన్సర్ చేసింది. తనకు ఇష్టమైన ఫుడ్ పచ్చి పులుసు అని వెల్లడించింది.