జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని వెంకట్రావుపేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. జగిత్యాల పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న సంధ్య ఆత్మహత్యకు పాల్పడింది. గత మార్చి నెలలో సంధ్యకు వివాహం జరిగినట్లు తెలిసింది. కానీ ఆమె ఆత్మహత్యకు గల కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవానికి పంచనామా నిర్వహించి.. పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.