సన్నిలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సన్నిలియోన్.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని సాన్ ఫెర్నోడో డిస్ట్రిక్‌లోని లేక్ బోల్పోలోని ఒక ద్వీపం లాంటి ప్రదేశానికి తన కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లింది . తాజాగా కరోనా నేపథ్యంలో ప్రజలకు దూరంగా ఓ ద్వీపంలో ఉంటున్నారు. జనాలకు దూరంగా ఉన్న ఈ ప్రదేశం తనతో పాటు తన పిల్లలకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది. నగరంలోని రణగొణ ధ్వనులకు దూరంగా ఉన్న ఈ ప్రదేశంలో సన్నిలియోన్ పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి రోజులు మళ్లీ రావు అంటూ కాస్తంత ఎమోషనల్ అయింది.