కొణిజర్ల: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను మంచానికి కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి రూ.32 వేల నగదు ఎత్తుకెళ్లిన ఘటన కొణిజర్లలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం: కొణిజర్ల ఎస్సీ కాలనీకి చెందిన వెంగళ సులోచన మధ్యాహ్నం ఇంట్లో టీవీ చూస్తుండగా మాస్క్‌ ధరించిన ఇద్దరు వ్యక్తులు చొరబడి మంచంపై పడుకుని ఉన్న సులోచన చేతులు, కాళ్లు కట్టాక పక్కనే బీరువాలో దాచిన రూ.32 వేల నగదు ఎత్తుకెళ్లారు.

కాసేపటికి ఆమె అతి కష్టంపై ఫోన్‌ దగ్గరకు తీసుకుని సమీప బంధువులకు ఫోన్‌ చేసి మాట్లాడకుండా మూలుగుతుండడంతో అనుమానంగా వారు వచ్చేసరికి చేతులు, కాళ్లు కట్టేసిన సులోచన కనిపించడంతో కాపాడారు. దీంతో వైరా సీఐ టి.సురేష్‌, కొణిజర్ల ఎస్సై జె.శంకరరావు క్లూస్‌టీం చేరుకుని వేలిముద్రలు సేకరించారు. అలాగే, కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. మూడు రోజుల పాటు పాత స్లాబ్‌ పగులగొట్టి రెక్కలుముక్కలు చేసుకుని సంపాదించుకున్న సొమ్ము ఎత్తుకెళ్లడంతో సులోచన కన్నీరుమున్నీరవుతోంది.