{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1625738478237","source":"other","origin":"gallery"}

పరమేష్ డిగ్రీ పూర్తి చేశాడు, ఊరిలో తడికేమీ లోటు లేదు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. ఆస్తి కూడా బాగానే ఉంది కానీ, సిటీ కల్చర్ అంటే బాగా మోజు ఉన్న పరమేష్ మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలన్న కోరికతో హైదరాబాద్ వచ్చాడు, అమీర్‌పేటలో ఓ గది అద్దెకు తీసుకుని పెంట్ హౌస్‌లో దిగాడు. కింద పోర్షన్‌లోనే ఇంటి ఓనర్స్ ఉంటున్నారు. ఆర్థికంగా పెద్దగా ఇబ్బదేమీ లేని పరమేష్‌ తనకు నచ్చిన జాబ్ వస్తే చేద్దాం, లేకపోతే హైదరాబాద్ సిటీలో ఓ 6 నెలలు బాగా ఎంజాయ్ చేసి తిరిగి గుంటూరు వెళ్లిపోదాం అనే ధోరణిలో ఉండేవాడు. ఇందులో భాగంగానే తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి ఉద్యోగ వేట చేసేవాడు. పరమేష్‌పై కన్నేసిన ఇంటి ఓనర్ పరమేష్ ఉంటున్న ఇంటి ఓనర్ సునయన ఆమె భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. సునయనకు ఒక కూతురు ఉంది ఆమె ఇంటర్మీడియట్ చదువుతోంది. భర్తకు వచ్చే పెన్షన్, ఇళ్లకు వచ్చే అద్దెతో కుటుంబం పోషిస్తోంది. అలాగే, సొతూరిలో ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి, కూతురి భవిష్యత్తు గురించి బెంగేమీ లేదు. సునయన వయసు కూడా పెద్దదేమీ కాదు దాదాపు ఓ 40 ఏళ్లు ఉంటాయి. ఈ క్రమంలోనే ఇంట్లో అద్దెకు దిగిన పరమేష్‌పై సునయన కన్నేసింది. ఓ రోజు జాబ్ వెతుకులాటలో భాగంగా బయటకు వెళ్లిన పరమేష్ మధ్యాహ్న సమయంలో ఇంటికొచ్చాడు. ఇది గమనించిన సునయన బయటకు వచ్చి పరమేష్‌తో మాటలు కలిపింది. ఇంట్లోకి పిలిచి మంచినీళ్లు ఇచ్చింది. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకరి గురించి మరొకరు చెప్పుకున్నారు. సునయన తన భర్త చనిపోయాడని, అప్పటి నుంచి కుటుంబ పెద్ద లేకుండానే ఉంటున్నామని తమ ఒంటరి జీవితం గురించి ఏకరవు పెట్టింది. సునయన మాటలకు పరమేష్ చలించిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత పరమేష్‌ను మాటల్లో పెట్టి అతడి ఒడిలో వాలిపోయింది. ఎందుకో, నిన్ను చూడగానే నా భర్త గుర్తొచ్చాడని చెప్పింది. దీంతో ఆమె వలలో పడిపోయిన పరమేష్ సునయనతో ఏకాంతంగా గడిపాడు. ఇక, ఆ రోజు నుంచి పరమేష్ ఉద్యోగం వెతుకులాటకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. రోజూ సునయన కూతురు కాలేజీకి వెళ్లే వరకు వేచి ఉండటం ఆమె వెళ్లిన తర్వాత ఆంటీ గదిలోకి వెళ్లడం సాయంత్రం వరకు సరసాల్లో మునిగిపోవడం దినచర్యగా పెట్టుకున్నాడు. సునయన కూతురితోనూ సంబంధం పరమేష్‌తో పీకల్లోతు బంధంలో మునిగిపోయిన సునయన అతడే సర్వస్వంగా భావించింది. ఈ క్రమంలో ఓ రోజు తన కూతురు ప్రియకు కాస్త అలసటగా ఉందని బైక్‌పై ఆమెను కాలేజీలో డ్రాప్ చేయలని పరమేష్‌ను సునయన కోరింది. దీంతో ప్రియను పరమేష్ కాలేజీలో డ్రాప్ చేశాడు. సాయంత్రం కాలేజీ ముగిశాక ఫోన్ చేస్తే పికప్ చేసుకుంటానని చెప్పాడు. ఆ రోజు నుంచి ప్రతి రోజూ ప్రియను పరమేషే కాలేజీకి డ్రాప్ చేసేవాడు. సునయన కూడా ప్రియ చిన్నపిల్ల కదా అని పరమేష్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతున్నా చూసీచూడనట్లు వదిలేసింది. దీంతో, ప్రియ కాలేజీ ముగిశాక మేడపైకి వెళ్లి పరమేష్‌తో మాట్లాడేది. ఈ క్రమంలోనే ప్రియ చదువుకు సంబంధించిన కొన్ని డౌట్స్ కూడా పరమేష్ క్లియర్ చేసేవాడు. పరమేష్‌ పద్ధతి బాగా నచ్చడంతో ప్రియ అతడితో ప్రేమలో పడిపోయింది. ఓ రోజు ‘‘పరమేష్ నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. రోజూ కాలేజీలో దిగబెట్టి, తిరిగి ఇంటికి తీసుకొస్తున్నావ్. నా చదువుకు సంబంధించిన డౌట్లు క్లియర్ చేస్తున్నావ్. నువ్వు చాలా మంచోడివి. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐలవ్యూ.’’ అని చెప్పి, పరమేష్ కౌగిట్లో వాలిపోయింది. పరమేష్ కూడా నో చెప్పకుండా ప్రియతో శారీరకంగా కలిశాడు.

తల్లితో పరమేష్ రెడ్‌హ్యాండెట్‌గా:

పరమేష్ ఓవైపు సునయనతో సంబంధం కొనసాగిస్తూనే ఆమె కూతురు ప్రియతోనూ రొమాన్స్ చేసేవాడు. అయితే, ఓ రోజు మధ్యాహ్నం ఎప్పట్లాగే సునయనతో పరమేష్ సరసాలు సాగిస్తుండగా అనుకోకుండా కాలేజీ మధ్యలోనే ప్రియ ఇంటికొచ్చింది. సోఫాపై పరమేష్‌తో తన తల్లి సరసాలు సాగిస్తుండటాన్ని ప్రియ తన కళ్లతో చూసింది. ప్రియను చూసిన పరమేష్, సునయన షాక్‌కు గురయ్యారు. ప్రియకు నచ్చజెప్పేందుకు వారు ప్రయత్నించగా మీరు ఇలాంటి వారని అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను ప్రేమించిన వ్యక్తితో సరసాలు ఏంటని తల్లిని నిలదీసింది. దీంతో సునయన సైతం షాక్‌కు గురైంది. ఒకవైపు తనతో రొమాన్స్ చేస్తూ తన తల్లితో అనైతిక బంధం ఏంటని పరమేష్‌ను సైతం ప్రశ్నించింది. దీంతో ప్రియతో తనకు ఉన్న సంబంధం గురించి అక్కడే సునయనకు పరమేష్ చెప్పాడు. దీంతో పరమేష్‌తో పెళ్లి చేస్తానని ప్రియకు తల్లి సునయన చెప్పింది.

కూతురి హత్యకు పక్కా ప్లాన్:

ఇది జరిగిన కొన్ని గంటలకు సాయంత్రం వేళలో పరమేష్‌ను సునయన పిలిచింది. ప్రియను ఈ రోజు రాత్రి చంపేస్తున్నట్లు పరమేష్‌కు సునయన చెప్పింది. దీంతో అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ‘‘నేను నిన్ను విడిచి ఉండలేను. ఒకవేళ ప్రియతో నీకు పెళ్లి చేసినా, మన సంబంధం గురించి తనకు తెలుసు కాబట్టి అనుమానంగానే చూస్తుంది. కాబట్టి ప్రియను చంపడం ఒక్కటే మార్గం.’’ అని పరమేష్‌కు సునయన చెప్పింది. తాను చెప్పినట్లు వినకపోతే తనను, తన కూతుర్ని మోసం చేశావని అందరికీ చెబుతానని పరమేష్‌ను బ్లాక్మెయిల్ చేసింది. దీంతో ప్రియను చంపేందుకు పరమేష్‌కు ఒప్పుకోక తప్పలేదు. ఆ రోజు రాత్రి ముందుగా చెప్పినట్లుగానే మెయిన్ డోర్ గడియపెట్టలేదు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో నిద్రపోతున్న ప్రియ గదిలోకి వెళ్లిన సునయన, పరమేష్ దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ సమయంలో సునయన ప్రియ కాళ్లు కదలకుండా పట్టుకుంది. తర్వాత, ప్రియ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీన్ క్రియేట్ చేశారు.

ప్రియ చేతిపై పచ్చబొట్టు:

మరుసటి రోజు ఉదయాన్నే సునయన బిగ్గరగా ఏడుస్తున్నట్లు నటించడం మొదలు పెట్టింది. ఉరికి వేలాడుతున్న ప్రియను పరమేష్ కిందకు దించాడు. ఈ విషయం మెల్లగా పోలీసులకు తెలిసింది. ఎస్సై రంగయ్య, కానిస్టేబుల్ కనకయ్య అక్కడికి చేరుకున్నాడు. ఎస్సై రంగయ్య విచారణ ప్రారంభించారు. అక్కడ పరిసరాలను పరిశీలించారు. ప్రియ చేతిపై ‘పరమ్’ అని పచ్చబొట్టు ఉండటాన్ని ఎస్సై రంగయ్య గమనించాడు. దీంతో, నీ పేరు పరమేష్ అన్నావు కదూ అని ప్రశ్నించాడు. అవునని చెప్పగా ప్రియ చేతిపై పచ్చబొట్టు ఉంది ఆమెకు, నీకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించాడు. అతడు తడబడటంతో ప్రియ శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, పరమేష్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోస్టుమార్టంలో షాకింగ్ విషయాలు:

పరమేష్‌ను విచారించడం ప్రారంభిన ఎస్సై రంగయ్య అసలేం జరిగిందో చెప్పాల్సిందిగా అతడిని కోరాడు. దీంతో ప్రియకు, తనకు ఎలాంటి సంబంధం లేదని కట్టుకథలు చెప్పడం ప్రారంభించాడు. అంతలోనే, ఎస్సై రంగయ్య ప్రియ పోస్టుమార్టం రిపోర్ట్ చదవడం ప్రారంభించారు. ప్రియపై ఇప్పటికే చాలా సార్లు లైంగిక దాడి జరిగిందని ప్రస్తుతం ఆమె గర్భవతి అని వెల్లడించారు. అలాగే, ఆమెది ఆత్మహత్య కాదని, పక్కాగా హత్య అని ముందగానే ఊపిరాడకుండా చేసి చంపేసి అనుమానం రాకుండా ఉరేసి తాను రాకముందే దించేశారని చెప్పారు. ఇక, ప్రియను రోజూ కాలేజీకి తీసుకెళ్లేది, పికప్ చేసుకునేది కూడా నువ్వేనని విచారణలో తేలినట్లు పరమేష్ రహస్య వ్యవహారాలన్నీ ఎస్సై పూసగుచ్చినట్లు వివరించారు. ఎస్సై నోటి నుంచి తన నేర చిట్టా విన్న పరమేష్ షాక్‌కు గురయ్యాడు. అసలు విషయం చెప్పాలని, లేకపోతే నిజాలు ఎలా రాబట్టాలో తమకు తెలుసని ఎస్సై రంగయ్య హెచ్చరించడంతో విషయం అర్థమైన పరమేష్ జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు వివరించారు. సునయన ఆంటీ, తాను కలిసే ప్రియను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పరమేష్‌ను, కన్నకూతుర్ని చంపిన సునయనను అరెస్టు చేశారు.

Note: మన చుట్టూ ప్రతి రోజూ ఎన్నో ఘోరాలు, దారుణాలు జరుగుతున్నాయి. అలాంటి యదార్థ గాథలను, కేటుగాళ్ల కంత్రీ ప్లాన్లను తెలియజేస్తూ.. ప్రజల్ని అప్రమత్తం చేయడమే ఈ క్రైమ్ డైరీ కథనాల ఉద్దేశం. నేరాల ఆనవాళ్లను పసిగట్టి సమాజంలో అప్రమత్తతను పెంచడమే ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశం.