చాలా సినిమాల్లో హీరో ఒక భార్యకు తెలియకుండా, మరో భార్యను మేటైన్ చేయడం చూసాం. అది సినిమా కానీ, నిజ జీవితంలో అలా మేటైన్ చేయడం కుదరదు. ఏదో ఒకరోజు నిజం తెలిసిపోతుంది, తాజాగా కామారెడ్డిలో ఇలాగే జరిగింది. పెళ్ళై, పిల్లలు ఉన్న విషయాన్నీ చెప్పకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రబోదుడు. అలాగే తాను రెండో పెళ్లి చేసుకున్న విషయం చెప్పకుండా, మొదటి భార్య దగ్గర సంసారం చేస్తున్నాడు. ఇలా ఇద్దరి దగ్గర అసలు నిజం చెప్పకుండా దాచిపెట్టాడు. ఇక ఇప్పుడు ఆ నిజం ఇద్దరికీ తెలిసినాక, ఇద్దరు కలిసి అతడిని రోడ్ మీదనే పిచ్చకొట్టాడు కొట్టారు. వివరాలు: యాదాద్రి భువగిరిజిల్లాకు చెందిన వేముల పరశురామ్ అనే వ్యక్తికి బోర్‌వెల్ వాహనాలు ఉండడంత, వాహన పనుల మీద వెళ్తున్నానంటూ భార్యకు చెప్పి కొంతకాలంగా వారానికి రెండు మూడు రోజులు ఇంటికి రావడం లేదు. మొదట్లో అతడి మాటలు నిజమే అనుకుంది. కానీ, ఆ తర్వాత అనుమానం కలిగింది. అయితే ఇటీవల బోర్‌వెల్ పనుల కోసమని, బయటకు వెళ్లిన అతడు మూడు నెలల తర్వాత తిరిగిరావడంతో భర్త పరాయి స్త్రీ వ్యామోహంలో చిక్కుకున్నాడని నిర్ధారించుకుంది.

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు, అతడి కదలికలపై నిఘా పెట్టింది. ఇదే సమయంలో ఊరికి వెళ్తున్నానని చెప్పి, బయలుదేరడంతో అతడిని వెంబడించింది. తనవెంట భార్య వస్తున్న విషయాన్నీ కనిపెట్టని పరశురామ్ కామారెడ్డిలోని రెండో భార్య ఇంటికి చేరుకున్నాడు. తన భర్త మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నిర్ధారించుకున్న ఆమె, స్థానికులకు ఈ విషయం చెప్పి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది. అయితే పరశురామ్ తనకు ఎవరూ లేరని నమ్మించి, తనను పెళ్లి చేసుకున్నాడని రెండో భార్య చెప్పడంతో అందరూ షాకయ్యారు. దీంతో ఇద్దరూ భార్యలు కలిసి అతడిని చితకబాదారు.