ఈరోజు హైదరాబాద్ పార్క్ హయత్ వేదికగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ఇండస్ట్రీకు చెందిన మరికొందరి కలయికలో 2020 మా అసోసేషియన్ డైరీ విడుదల కార్యక్రమంలో కాస్త రసాభాస చోటు చేసుకోవడం కలకలం రేపింది.ఇదిలా ఉండగా దీనితో పాటు మరో అద్భుతమైన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది.

అదే డైలాగ్ కింగ్ మోహన్ బాబును మెగాస్టార్ చిరంజీవి ఆలింగనం చేసుకొని ముద్దుపెట్టుకోవడం. ఈ మీటింగు జరుగుతున్న సమయంలో మా అసోసేషియన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజశేఖర్ కొన్ని సంచలన కామెంట్స్ చేసిన అనంతరం చిరు మాట్లాడిన మాటలకు స్టేజ్ పై ఉన్న పెద్దలు మద్దతు పలికారు.రెబల్ స్టార్ కృష్ణంరాజు సహా మోహన్ బాబు కూడా చిరు చెప్పిన మాటలతో ఏకీభవించి మద్దతు పలికారు.

అలా మోహన్ బాబు మాట్లాడుతూ చిరుకు మరియు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తమ మధ్య నడిచేవి కేవలం ఛలోక్తులు మాత్రమే అని అంతే కాకుండా తమ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని మా రెండు కుటుంబాలు ఎప్పటికీ ఒక్కటే అని నవ్వుతూ మాట్లాడేసరికి మెగాస్టార్ లేచి మోహన్ బాబు దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకొని ముద్దు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటోయే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.