హాసంపర్తి పోలీస్ స్టేషన్ పరిధి జయగిరి గ్రామ శివారులో కోడి పందేముల పోటీ నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో బుధవారం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు బి. నంది రామ్, మధు. సిబ్బంది జయగిరి గ్రామ సరిహద్దుల్లో వెళ్లి మెరుపు దాడి చేశారు. అక్కడ 05 గురు వ్యక్తులు కలిసి 04 పందెం కోళ్లతో పోటీ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని ఆటలో పెట్టిన పందెం కోళ్లను, వారు పందెం లో పెట్టిన రూపాయలు రూ. 3,260/-లను, 04 మొబైల్ ఫోన్లను, 03 ద్వి చక్ర వాహనాలను స్వాధీనపరచుకున్నారు.

అదుపులోకి తీసుకున్న వారిలో వాజ్పేయి కాలనీకి చెందిన దేవరకొండ రాములు, హనుమకొండకు చెందిన దేవరకొండ భిక్షపతి, సమ్మయ్య నగర్ కు చెందిన యాకుబ్ పాషా,వాజ్పేయి కాలనీకి చెందిన ఓని సుధాకర్, వరంగల్ ఏనుమముల, బాలాజీ నగర్ కు చెందిన సయ్యద్ మౌలాలి 5 గురు నేరస్తులను, పందెం కోళ్లను, 03 ద్విచక్ర వాహనాలను, 04 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని హాసన్ పర్తి పోలీస్ లకు అప్పగించారు. ఈ దాడిలో హసన్ పర్తి ఏఎస్ఐ ప్రకాష్ రెడ్డి, పోలీసు సిబ్బంది రాంప్రసాద్, వెంకన్న, రమేష్ లు పాల్గొన్నారు.