గ్రేటర్ 58 వ డివిజన్ కార్పొరేటర్ బానోతు కల్పనా భర్త సింగులాల్ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా స్వలాభం కోసమే పనిచేస్తున్నారని అందుకే మనస్థాపంతో టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ సముద్రాల మధు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ పటిష్టత కోసం, ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం అహర్నిషలు పనిచేసిన నాకు పార్టీలో మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. కార్పొరేటర్ కల్పన భర్త సింగులాల్ స్వలాభాపేక్ష కోసమే పనిచేస్తూ స్తానిక సమస్యలు పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో అటు పార్టీకే కాకుండా ఇటు ఉద్యమకారులకు తీవ్ర అవరోధాన్ని కలిగిస్తూ కనీసం కార్యకర్తలను కూడా గుర్తించకుండా వారికి భజన చేసేవారికి మాత్రమే పార్టీ సభ్యులుగా గుర్తిస్తూ పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారని తెలిపారు.

కనీసం తెలంగాణ ఉద్యమ కారులను కూడా పట్టించుకోకుండా తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నందున మనస్థాపంతో టీఆర్ఎస్ పార్టీకి, సభ్యత్వానికి శాశ్వతంగా రాజీనామా చేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు, వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లుతో పాటు స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ కు లేఖ ద్వారా రాజీనామా పత్రాన్ని పంపించారు.