ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు లాంటిదని ప్రముఖ కవి, కాళోజీ పురస్కార గ్రహీత గోరటి వెంకన్న అన్నారు. శుక్రవారం రంగశాయిపేటలోని ప్రభు త్వ పాఠశాలలో హెచ్‌ఎం నర్సింహారెడ్డి అధ్యక్షతన తెలుగు సాహిత్య కళాపీఠం (సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ) ఆధ్వర్యంలో బూర్గుల వెంకటమ్మ స్మారక ప్ర తిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోరటి వెంకన్న హాజరై మాట్లాడుతూ తెలంగాణలో కళలకు, కళాకారులకు కొదవ లేదన్నా రు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతీ యేటా ప్రతిభా పురస్కారాలను అందజేయడం హర్షణీయమన్నారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. అనంతరం పదో తరగతి లో పాఠశాల టాపర్‌గా నిలిచిన, క్రీడల్లో రాణిస్తున్న పలువురు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అం దజేశారు. పలువురు కవులను సత్కరించారు. ఈ సంద ర్భంగా జనంలోకి ప్రవహిస్తున్నా, నాన్న నీకు నూరేళ్లు పుస్తకాలను వెంకన్న ఆవిష్కరించారు. కార్యక్రమంలో న రేంద్రస్వామి, బూర్గుల మధుసూదన్, డాక్టర్ గిరిజా మనోహర్‌బాబు, డాక్టర్ తిరునగరి, సరస్వతి, మల్లేశం, రావుల బాలరాజు, సార య్య, ఈటల సమ్మన్న, చిక్కా దేవదాస్, పేరడి గురుస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.