దేశంలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపతో కూడిన అత్యున్నత సంస కన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా – క్రెడాయ్ రెండు రోజుల పాటు వరంగల్ ప్రోపర్టీ షో 2019ను నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది . క్రెడాయ్ వరంగల్ ప్రోపర్టీ షో 2019 హన్మకొండలోని నక్కలగుట్ట వద్దనున్న నందన గార్డెన్స్ వద్ద అకోబర్ 19 – 20 , 2019వ తేదీలలో జరుగనుంది . రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రోపర్టీ షో , నగరవ్యాప్తంగా రియల్టర్లు , బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులు , కన్సల్టెంట్లు మరియు ఆర్ధిక సంస్థలను ఒకే తాటిపైకి తీసుకురావడంతో పాటుగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యాధునిక ధోరణులను ఒకే చోట ప్రదర్శించనుంది . ఈ కార్యక్రమంలో ఇంటి గ్రేటెడ్ టౌన్ షిన్లు , అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లు , గేటెడ్ కమ్యూనిటీలు , విల్లాలు , గ్రీన్ బిల్డింగ్స్ తో పాటుగా రిటైల్ , కమర్షియల్ కాంప్లెక్స్ పై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు .

ఈ షోలో తయారీ రంగం నుండి డెవలపర్ల వరకు:

ఈ షోలో ఆర్థిక , తయారీ రంగం నుండి డెవలపర్లు , విభిన్నమైన వాటాదారులు పాల్గొననున్నారు . ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కరి బడ్జెట్ కు తగినట్లుగా ఆస్తులను ప్రదర్శించడంతో పాటుగా వరంగల్ లోని నివాసితుల అత్యుత్తమ అవసరాలను తీర్చేలా ఉంటాయి . గృహ ఋణ అవకాశాలను గురించిన సమాచారంతో పాటుగా వాటిని ఏ విధంగా పొందవచ్చు వంటి సమాచారం సైతం ఈ షోకు విచ్చేసిన సందర్శకులు పొందవచ్చు . ఈ ప్రోపర్టీ షోలో విలువ ఆధారిత గృ హాలతో పాటుగా లగ్జరీ గృహాలు సైతం ప్రదర్శిస్తారు . డెవలపర్లు నుంచి ఉత్సాహపూరితమైన ఆఫర్లను సైతం పొందవచ్చు .

క్రెడాయ్ ప్రోపర్టీ షో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో శ్రీ ఈ ప్రేమ సాగర్ రెడ్డి , సెక్రటరీ , క్రెడాయ్ తెలం , మాట్లాడుతూ ” గత కొద్ది నెలలుగా , అత్యున్నత సంస్కరణలకనుగుణంగా మా వ్యాపార ప్రణాలిక స్వీకరించాం . ఇది మరింత పారదర్శక , అనుకూలమైన వ్యాపార వాతావరణం దిశగా తీసుకువెళ్లనుంది . వరంగల్ నగరం అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది . 2016లో విజయవంతంగా ప్రతిపాదిత స్కార్ నగరాల రెండవ జాబితాలో చోటు సంపాదించుకుంది . ఈ అమలు పనిని గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమి నిర్వహిస్తోంది . కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (జీడబ్ల్యుఎంసీ) లకు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు భారీ ప్రణాళికలు ఉన్నాయి .

రాబోయే 50 సంవత్సరాలు:

రాబోయే 50 సంవత్సరాల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్మాణం జరుగుతుంది . దీనిలో మెగా టౌన్షప్ , సార్ రోడ్స్ , మల్టీ – లెవల్ కార్ పార్కింగ్ ప్రాజెక్ట్ , రూప్ సోలార్ ప్రాజెక్టులు మరియు మరెన్నో ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి . వరంగల్ లో ఆర్ధిక వ్యవస్థ సైతం వృద్ధి చెందుతుంది . ఈ నగరంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఇనిస్టిట్యూట్లు అయినటువంటి నిట్ వరంగల్ , కాకతీయ యూనివర్శిటీ ఉన్నాయి . అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగంతో పాటుగా పారిశ్రామిక కేంద్రాలైనటువంటి మెగా టెక్స్ టైల్ పార్క్ వంటివి ఉన్నాయి . ఇతర మెట్రోపాలిస్ నగరాలు ఏవైతే ఆఫర్ చేస్తున్నాయో అవన్నీ ఇది ఆఫర్ చేస్తుంది . బాగా అభివృద్ధి చేసిన సామాజిక మౌలిక వసతులు , కెరీర్ , ఉద్యోగావకశాలు ఇక్కడ ఉన్నాయి .

ఎన్నో విద్యాసంస్థలు , యూనివర్శిటీలు , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు హైదరాబాదు ప్రత్యామ్నాయంగా ఈ నగరాన్ని చూస్తున్నాయి మరియు వరంగల్ లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి . ఈ వాతావరణం ప్రత్యక్షంగా గృహ , రెంటల్ డిమాండను నగరంలో వృద్ధి చేస్తుంది . ఈ నగరం ఇప్పటికే అత్యంత ఆకర్షణీయమైన విద్యాకేంద్రంగా నిలువడంతో పాటుగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంజినీరింగ్ , మెడికల్ కాలేజీలకు కేంద్రంగా నిలుస్తుంది . రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమలు పెట్టేందుకు పెట్టుబడులను ప్రత్యేక ప్రోత్సాహాకాల ద్వారా ప్రోత్సహిస్తుంది . మరియు పారిశ్రామికీకరణ పరంగా జిల్లాలను వికేంద్రీకరించాలని ప్రణాళిక చేస్తుంది ” అని అన్నారు . శ్రీసీ జగన్‌మోహన్ , వైస్ చైర్మన్ , క్రెడాయ్ తెలంగాణా మాట్లాడుతూ ” ప్రోపర్టీ ఇన్వెస్టర్లకు భవిష్యత్ కేంద్రంగా వరంగల్ నిలిచేందుకు అవకాశాలున్నాయి . స్మార్ట్ నగరాల జాబితాలో చోటు కల్పించడంతో , తెలంగాణాలో రెండవ వాణిజ్య నగరంగా నిలిచేందుకు వరంగల్ కు ఎక్కువ అవకాశాలున్నాయి . అత్యుత్తమ మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీని వరంగల్ అందిస్తుంది .

పెట్టుబడులను ఆకర్షించడం

పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా ఆర్ధిక కార్యకలాపాలను వృద్ధి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది . ఐటీ , ఐటీయేతర రంగాలు , పర్యాటకం , ఆతిథ్య రంగాల్లో ఉపాధి అవకాశాలను పట్టణ ప్రాంతాల్లో మరియు టెక్స్ టైల్స్ , ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంది . వరంగల్ – హైదరాబాద్ హైవే లేదా నేషనల్ హైవే 163 , వరంగల్ నగరాన్ని తూర్పు మరియు మధ్య హైదరాబాదు అనుసంధానిస్తుంది . ఈ కారిడార్ అభివృద్ధి రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి తోడ్పడుతుంది . ఔటర్ రింగ్ రోడ్ ( ఓఆర్ఆర్ ) జాతీయ రహదారులకు మరియు చిన్న పట్టణాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది . ఇటీవలి కాలంలో భూముల ధరలు పెరుగుతున్నాయి మరీ ముఖ్యంగా వరంగల్ – హైదరాబాద్ హైవే మరియు ఓఆర్ఆర్ లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది .

“త్రి నగరం” వరంగల్ హన్మకొండ కాజిపేట్ లలో:

గృహ మరియు వాణిజ్య ప్రాంగణాలతో పాటుగా ప్లాట్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి . వరంగల్ లో కొన్ని ప్రాచుర్యం పొందిన ప్రాంతాల్లో కొత్త పేట , కాజీపేట , హనమకొండ వరంగల్ ప్రోపర్టీ షో ఇప్పుడు నగరంలోని ప్రోపర్టీలను ఒకే మరియు సుబేదారి వంటివి ఉన్నాయి . క్రెడాయ్ వరంగల్ ప్రోపర్టీ షో ఇప్పుడు నగరంలోని చోట చూసే అవకాశం కల్పిస్తుంది ” అని అన్నారు ఈ సందర్భంగా శ్రీశరత్ బాబు , అధ్యక్షుడు , క్రెడాయ్ వరంగల్ మాట్లాడుతూ “ రాబోయే కొది సం గహరంగానికి గణనీయమైన డిమాండ్ ఉంటుందని మేము అంచనావేస్తున్నాం . ఈ కోణంలోనే మేము అత్యంత విశ్వసనీయమైన – క్రెడాయ్ వరంగల్ ప్రోపర్టీ షోను 19 – 20 అక్టోబర్ 2018 నిర్వహించబోతున్నాం . ప్రస్తుతం వరంగల్ నగరంలో అతి తక్కువగా ఉన్న ఆస్తుల ధరలలో విని అత్యుత్తమ అవకాశాలను అందించనుంది ” అని అన్నారు .