భద్రాకాళి చెరువు కట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. హృదయ్‌ పథకంలో భాగంగా కేటీఆర్ గారి ప్రత్యక చొరవతో, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భద్రకాళీ చెరువు కట్టను సరికొత్తగా తీర్చిద్దింది. కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా రాతి కట్టడాలతో ఆకర్షనీయంగా నిర్మించారు. నగరవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బండ్‌పై నడక సాగించేందుకు ప్రత్యేకంగా సింథటిక్‌ వాకింగ్‌ ట్రాక్‌, వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేశారు. మొదటి దశలో రూ.21 కోట్ల వ్యయంతో, రెండో దశలో రూ.66 కోట్ల వ్యయంతో నిర్మాణాలను చేపట్టారు. చారిత్రకనగరంగా భాసిల్లే ఓరుగల్లుకు మరో ఆకర్షణగా నిలవనున్న భద్రకాళీ బండ్‌ను మంత్రి కేటీఆర్‌ త్వరలో ప్రారంభించనున్నారు..