ప్రముఖ యంగ్ స్టార్ శర్వానంద్ ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్ వీడి రక్షిత రెడ్డి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. రాజస్థాన్లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. జూన్ మూడవ తేదీన అనగా శనివారం రాత్రి వీరి వివాహం జరగగా శుక్రవారం హల్దీ, సంగీత ఫంక్షన్ లు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో శర్వానంద్ వాల్తేరు వీరయ్య సినిమాలోని పూనకాలు లోడింగ్ పాటకు స్టెప్పులేసి మరీ అదరగొట్టేశారు. ఇకపోతే హల్దీ ఫంక్షన్ కు హాజరు కాకపోయినా సంగీత్ ఫంక్షన్లో శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యి సందడి చేశారు. అంతేకాదు ఆ ఈవెంట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకు రాగా శర్వానంద్ దంపతులు ఇందులో చాలా చూడచక్కగా ఉన్నారు అంటూ నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

ఇక మొత్తానికి అయితే ఈ జంట పెళ్లి ఫోటోలు ఎప్పుడు బయటకు వస్తాయని అందరూ ఎదురు చూడగా ఎట్టకేలకు వీరి వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇకపోతే రాజస్థాన్లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ లో హవా మహల్లో చాలా అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరగగా నిన్న రాత్రి 11 గంటల సమయం తర్వాత వీరిద్దరూ మూడు ముళ్ళు ఏడు అడుగులతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి పలువురు ప్రముఖులు, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరైనట్లు సమాచారం. ఇక వరంగల్ నుంచి మేయర్ శ్రీమతి. గుండు సుధారాణి గారి తనయుడు BRS పార్టీ రాష్ట్ర యువ నాయకులు శ్రీ.గుండు విజయ్ రాజ్ గారు తన మిత్రుడు హీరో శర్వానంద్ పెళ్లి వేడుకల్లో హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసాడు…