కొడుకు వయసున్నవాడితో ఓ మహిళ అక్రమ సబంధం అతడి ప్రాణాలు బలికొంది. కూతురిని విధవరాలిని చేసింది. ఓ తల్లి కామం చేసిన పాపం ఇది. తనతో అక్రమ సంబంధం ఉన్నవాడికి మొదటి భార్యకు విడాకులిప్పించి, రెండో పెళ్లిగా తన కూతుర్ని ఇచ్చి అల్లుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. అరిపిరాల రవిశంకరశర్మ(35)ది త్రిపురాంతకం మండలంలోని కొత్త ముడివేముల గ్రామం.

ఇతను గుంటూరులో చదువుకునే రోజుల్లో అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రవిశంకరశర్మ తల్లిదండ్రులు దోర్నాలకు చెందిన యువతితో అతనికి వివాహం చేశారు. పెళ్లైనప్పటికీ అతను వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలోనే తమ బంధానికి అడ్డుగా ఉందనే కారణంతో రవిశంకరశర్మ, అతని భార్యకు ఆ మహిళ విడాకులు ఇప్పించింది.

అనంతరం అతను హైదరాబాద్‌ వెళ్లి అక్కడ తన బంధువుల వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన మహిళ తన పెద్ద కుమార్తెను ప్రియుడైన రవిశంకరశర్మకు ఇచ్చి రెండో వివాహం చేసింది. అతను పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భర్త, తన తల్లి మధ్య వివాహేతర సంబంధం ఉందని భార్యకు అనుమానం ఏర్పడింది. దీంతో దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తి తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. రవిశంకరశర్మ శనివారం రాత్రి కురిచేడు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అక్కడ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని జేబులో లభించిన లేఖ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు.