తన స్కూల్లో చదువుతున్న విద్యార్థితో లైంగిక వాంఛ తీర్చుకున్నారు. వ్యవహారం బయటపడడంతో కటకటాలపాలయ్యారు.

వివరాలు:. అమెరికాలోని లూసియానాలోని మిడిల్ స్కూల్లో ఓ మహిళ(34) సైన్స్ టీచర్‌గా పనిచేస్తోంది. తన స్కూల్‌ విద్యార్థిని ఇంటికి పిలిపించుకుని లైంగిక వాంఛను తీర్చుకునేది. ఇలా కనీసం 9 సార్లు ఆ మహళా టీచర్ ఇద్దరు విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె తన నగ్న ఫోటోలు, వీడియోలను కూడా స్టూడెంట్‌కు ఈ-మెయిల్ పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. టీచర్ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో స్కూల్ యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది.

ఈ మెయిల్‌లో నగ్న ఫోటోలు :

శారీరక సంబంధం కోసం ముందుగా స్కూల్‌కు సంబంధించిన అధికారిక ఈ-మెయిల్ ద్వారానే టీచర్ స్టూడెంట్‌కి ఈ-మెయిల్ పంపేది. ఆ తర్వాత పర్సనల్ ఈ-మెయిల్ ద్వారా ఇద్దరు మాట్లాడుకునేవారు. తన నగ్న ఫోటోలు, వీడియోలను స్టూడెంట్‌కి పంపి అనంతరం తన మనసులోని మాట చెప్పేది. దానికి అంగీకరించిన విద్యార్థిని ఇంటికి రప్పించుకొని అఘాయిత్యానికి పాల్పడేవారు.

గంజాయి ఇచ్చి:

ఈ మెయిల్‌ ద్వారా నగ్న ఫోటోలు పెట్టి విద్యార్థిని వలలో వేసుకున్న టీచర్‌ అనంతరం తన కారులో అతన్ని ఇంటికి తీసుకువెళ్లేది. అక్కడ ఆ విద్యార్థితో లైంగిక కోరిక తీర్చుకొని ఇంటికి పంపించేది. స్టూడెంట్‌లో కామవాంఛ పెంచేందుకు గంజాయిలాంటి మాధక ద్రవ్యాన్ని కూడా అతనికి ఇచ్చేదని పోలీసులు పేర్కొన్నారు. ఓ విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని విచారణ చేపట్టగా ఈ ‘నగ్న’సత్యాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోఉండి విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించిన సదరు మహిళను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.