హైదరాబాద్‌: నగరంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఓఆర్ఆర్ దాటిన తర్వాత పెద్దంబర్‌పేట సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ డ్రైవర్‌ సడెన్ బ్రేక్‌ వేయడంతో వెనుకనే వేగంగా వచ్చిన ఓ కారు టిప్పర్ ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులను నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్‌పల్లికి చెందిన ఎంపిటిసి దొంతం కవిత, ఆమె భర్త వేణుగోపాల్‌ రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.