కట్టుకున్న భర్తే భార్య పరువు తీసిన ఘటన పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య నుంచి విడాకులు తీసుకోవాలని ఆమె నగ్నంగా స్నానం చేస్తున్న వీడియోలను పోర్న్ సైట్లలో పెట్టిన భర్తను అతడి ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతాకు చెందిన రవి చంద్ (పేరు మార్పు) ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోంది.

అక్కడే మౌనిక అనే యువతితో, రవిచంద్‌కు పరిచయం ఏర్పడి కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రవి చంద్ భార్య కవిత భర్త వివాహేతర బంధాన్ని నిలదీసి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. దీంతో భార్య కవిత పరువు బజారుకీడ్చి, విడాకులు ఇచ్చేలా ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కవిత బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేశాడు.

అంతేకాదు ఆమె నగ్నంగా స్నానం చేసిన వీడియోలను సేకరించి వాటిని బూతు సైట్లలో పెట్టాడు. అంతేకాదు బంధువులకు ఆ లింకులు పెట్టి, తన డబ్బు కోసం బూతు వీడియోలు చేస్తుందని..ప్రచారం చేశాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త రవిచంద్, అతడికి సహాయం చేసిన యువతి మౌనికను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.