అహ్మదాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది. అతడి భార్య 22 నెలలు కాపురం చేసినప్పటికీ అతడితో శృంగారానికి నో చెప్పడంతో యువకుడు నిరాశలో కూరుకు పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో, మరణించిన యువకుడి తల్లి తన కోడలిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మృతుడు సురేంద్ర రైల్వే విభాగంలో పనిచేస్తున్నాడని 2018 అక్టోబర్‌లో గీతా అనే యువతిని వివాహం చేసుకున్నాడని, మృతుడి తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే 2016 లోనే సురేంద్ర తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకొని గీతను పెళ్లి చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు గీతకు కూడా 2 వివాహాలు జరిగాయి. ఆమె తన భర్తల నుండి కూడా విడాకులు తీసుకున్న అనంతరం సురేంద్రను వివాహం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

కాగా సురేంద్ర, గీతలకు పెళ్లి అయినప్పటికీ ఇద్దరి మధ్య శారీరక బంధం లేదని సురేంద్ర తల్లి ఆరోపించింది. కుమారుడు సురేంద్ర తన భార్య గీత శృంగారానికి ఒఫ్పుకోవడం లేదని తరచూ బాధపడేవాడని తెలిపింది. ఇదే విషయంపై గీతను నిలదీయగా, తన భర్తతో కలిసి పడుకోవటానికి ఇష్టపడటం లేదని గీత తెగేసి చెప్పినట్లు తెలిపింది. తన భార్య తనకు శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించకపోవడం పట్ల సురేంద్ర చాలా నిరాశకు గురయ్యాడని సురేంద్ర తల్లి చెప్పింది. దీని తరువాత, చిన్న విషయాలపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగాయని. కోడలు గీత ఇంటికి వెళ్ళినప్పుడు పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్ళినప్పుడు, సురేంద్ర ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు. కేసు నమోదు చేసిన తరువాత, దర్యాప్తు చేస్తున్నారు.