వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం మరో మారు మాజీ డిప్యూటీ CMలైన డాక్టర్ తాటికొండ రాజయ్య , కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరుకు తెరలేపే పరిస్థితి నెలకొంది . రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ మంత్రిమండలిలో మంత్రి పదవిని ఆశించిన సీఎం కేసీఆర్ వీరిద్దరికీ అవకాశం ఇవ్వలేదు. ఇద్దరిలోనూ అసంతృప్తి ఉంది . ఈ క్రమంలో కేబినెట్ విస్తరణకు కొద్ది రోజుల ముందు నుంచి ‘ కడియం ‘ వేగంగా పావులు కదపడం ప్రారంభించారు . దీంతో నియోజకవర్గంలో ఆయన వర్గం మళ్లీ క్రియాశీలకంగా మారింది,

దీంతో ‘ కడియం ‘ , ‘ తాటికొండ ‘ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ప్రస్పుటమవుతున్నాయి. బోటు ప్రమాదంలో మృతి చెందిన కడిపికొండ వాసులను పరామర్శించే విషయం లోనూ వీరిద్దరి మధ్య పోటీ నెలకొందని రాజకీయ వశ్లేషకులు పేర్కొంటున్నారు . ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు బాట కార్యక్రమంలో ఇరు వర్గాలు ఎవరికి వారే భారీ జనసమీకరణ చేసి కాళేశ్వరం పర్యటన చేశారు. ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేధాలు మరోసారి పతాకస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి . మంత్రిమండలి విస్తరణలో అవకాశం వస్తుందని భావించిన కడియం , కేబినెట్ విస్తరణ వరకు మౌనంగా ఉన్నారు .

మరోసారి మంత్రి పదవి చేజారడంతో ‘ స్టేషన్ ‘ లో తన పట్టు నిలుపుకోవడానికి సిద్ధమయ్యారు . ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు బాట కార్యక్రమం చేపట్టారు . ఎమ్మెల్యే రాజయ్య వర్గం కంటే పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులను , ప్రజలను ‘ కడియం ‘ వర్గం తరలించింది . ముందస్తు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన ‘ కడియంకు నిరాశే మిగిలింది . పార్టీ అధిష్టానం మేరకు రాజయ్యకు ‘ కడియం ‘ వర్గం మద్దతు ప్రకటించి ప్రచారం చేసింది . రెండోసారి అధికారంలో కొచ్చాక తొలి మంత్రివర్గంలో ‘ కడియం ‘ మంత్రి పదవిని ఆశించినా భంగపాటు తప్పలేదు . దీంతో ఇక నియోజకవర్గంలో తన వర్గాన్ని కాపాడు కోవడానికి , పట్టు నిలుపుకోవడానికి . సంకేతాలు ఇస్తున్న పరిస్థితి..