ఆత్మరక్షణ కింద పోలీసు కేసు పెట్టకుండా వదిలిపెట్టేశారు. తమిళనాడు లోని షోలింగర్ లో 17 ఏళ్ల యువతి అజిత్ కుమార్ అనే వీడిని చంపేసింది. అమ్మాయి కాలకృత్యాలు కోసం ఊరి బయటకు వస్తే , వీడు అమ్మాయిని కత్తి చూపి బెదిరించి నగ్నంగా తయారై, అమ్మాయిని అలాగే చేయమన్నాడు. తాగిన మైకంలో కత్తి అమ్మాయి పీకపై పెట్టాడు. దీంతో అమ్మాయి ఒక్కసారిగా వాడిని తోసేయ్యడంతో తల వెనకేఉన్న చెట్టుకు కొట్టుకుంది వెంటనే కత్తి కిందపడింది. ఆ కత్తి తీసుకొని అమ్మాయి వాడిని పొడిచి చంపేసింది. అక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగింది చెప్పేసింది. కేసు విచారించిన పోలీసులు, ఆత్మరక్షణ కోసమే అమ్మాయి వాడిని చంపింది అని నిర్దారించుకొని ఐపిసి సెక్షన్ 100 కింద ఆమెను వదిలిపెట్టేశారు…