ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. కదులుతున్న వాహనంలో ఓ కళాశాల విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. కాలేజీకి వెళ్తున్న బిఎస్సీ విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్చాచారం చేశాడు. రేపిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ దిగ్భ్రాంతికరమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఈటా జిల్లాలోని భగ్వాలా పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం నాడు చోటు చేసుకుంది. బుధవారం ఉదయం యువతి ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరింది. విద్యార్థిని కాలేజీకి వెళ్లడానికి టెంపో ఎక్కింది, టెంపోలో ఇతర విద్యార్థులు కూడా ఉన్నారు. కాలేజీకి చేరగానే విద్యార్థులంతా దిగిపోయారు.

విద్యార్థిని కూడా దిగడానికి సంసిద్ధం అవుతుండగా ఒక్కసారిగా డ్రైవర్ టెంపోను ముందుకు కదలించాడు దాంతో టెంపో ముందుకు సాగింది. ఈ క్రమంలో డ్రైవర్ తో పాటు ఉన్న ఓ విద్యార్థి యువతిపై అత్యాచారం చేశాడు. దీన్ని గమనించిన కొంత మంది టెంపోను ఆపి, యువతిని రక్షించారు. సంఘటన తర్వాత యువతిని ఆస్పత్రికి పంపించారు. బాధితురాలి తంజ్ డరి తప్రీత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేపిస్టు యువకుడితో పాటు కుట్రలో పాలు పంచుకున్న టెంపో డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు..