విశాఖ జిల్లా కసింకోట మండలం ఏ.ఎస్.పేటకు చెందిన అప్పల్రాజు, గొండుపాలేనికి చెందిన సంధ్యకి గతేడాది నవంబర్‌లో వివాహమైంది. ఏడాదిలోపే వీరికి మగ శిశువు జన్మించాడు. అప్పల్రాజు అచ్యుతాపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే అప్పల్రాజు శుక్రవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 10గంటల సమయంలో బాబు ఏడవడంతో సంధ్య శిశువుకు పాలు పట్టింది. అయితే ఏమైందో ఏమోగానీ అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో బాబును నీటిలో పడేసింది.

ఆ తర్వాత అప్పల్రాజును అర్ధరాత్రి వేళ లేపి బాబు కనిపించడం లేదని చెప్పింది. దీంతో అప్పల్రాజు చుట్టుపక్కల వెతికాడు అయినా లాభం లేకపోవడంతో రాత్రి 2గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఇంటి సమీపంలోని నీటి డ్రమ్ములో బాబు మృతదేహాన్ని గుర్తించారు.

ఎందుకు చంపిందంటే.?

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా కన్నతల్లే హత్య చేసిందని బాబుకు పాలు పట్టే సమయంలో నొప్పి వస్తుండటంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సంధ్య చెప్పడంతో అక్కడి వారంతా నిర్ఘాంతపోయారు. సంధ్యకు మానసిక పరిస్థితి లేదని గుర్తించిన పోలీసులు వైద్యుల సమక్షంలో విచారణ చేపట్టి ఆమే హత్య చేసినట్లు నిర్థారించారు. తన మతిస్థిమితం బాగోలేదని, ఎందుకు చంపోనో తనకే తెలియదని సంధ్య పోలీసులకు వివరణ ఇచ్చింది. ‘సంధ్య, అప్పలరాజు ఏడాది కింట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటలకు 34 రోజుల బాబును తీసుకెళ్లి వరండాలో ఉన్న డ్రమ్ములో సంధ్య ముంచేసింది. అనంతరం తనకేమీ తెలియనట్లు బాబు కనిపించట్లేదని నాటకమాడింది’ అని పోలీసులు వివరించారు.