కరీంనగర్ సిటీ: అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఎంపీటీసీల రూపంలో షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైన రెండో రోజున చొప్పదండి వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భూపాలపట్నం ఎంపీటీసీ మునిగాల విజయ లక్ష్మీ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో తన నామినేషన్ పత్రాలను అందించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ:

రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ సభ్యులను ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో కానీ మండల పరిషత్‌లలో కానీ తమకు నిధులు కేటాయించలేదని, కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీలు లేవన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి మండలిలో తమ గళాన్ని వినిపిస్తామని విజయ లక్ష్మీ వెల్లడించారు.