భారత కరెన్సీ నోట్లపై మహాత్మ గాంధీ ఫొటోతో పాటు మరో ‘ఇద్దరు ప్రముఖుల చిత్రాలు ముద్రించాలని RBI భావిస్తోంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫొటోలను కొత్తగా విడుదలయ్యే కొన్ని డినామినేషన్ నోట్లపై ముద్రించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఠాగూర్, కలాం వాటర్ మార్క్స్ కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు RBI తెలిపింది. ఇది పూర్తికాగానే కొత్త నోట్లపై వారి ఫొటోలు ముద్రిస్తామని వెల్లడించింది.