ఉత్తర ప్రదేశ్ మంత్రి కమల రాని వరుణ్ కాసేపటి క్రితం కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె వయసు 62ఏళ్లు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆమె.. కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. కరోనా సోకిందని తెలియడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.