కరోనా వైరస్‌కు మందు కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా తలపండిన శాస్త్రవేత్తలు ఆరేడు నెలలుగా జుట్టుపీక్కుంటున్నారు. ఇప్పట్లో కుదిరే పనికాదంటూ చేతులెత్తేశారు. మందు రావాలంటే మరో ఏడాది పట్టొచ్చని చెబుతున్నారు. మరోపక్క.. తాను కరోనాకు మందు కనిపెట్టేశాని, మార్కెట్లోకి తీసుకొస్తున్నాణని ప్రముఖ యోగా గురువు, ప‌తంజ‌లి సంస్థల అధినేత బాబా రామ్ ‌దేవ్ ప్రకటించారు. ఆయుర్వేద మూలికలతో దీన్ని తయారు చేశామని, ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని వెల్లడించారు.

మందు వివరాలతో ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాశారు. అశ్వగంధ, గిలోయ్, తులసివతి మూలికల మిశ్రమంతో క‌రోనాను అడ్డుకోవచ్చని వివరించారు. తాము తయారు చేసిన మందు శరీరంలోని మొత్తం కణజాలపై పని చేస్తుందన్న ఆయన రోగులకు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తిన్న తర్వాత అందించామన్నారు. వందశాతం మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. అశ్వగంధ కరోనా లక్షణాలైన జలుబు, శ్వాస ఇబ్బందులను అరికడుతుంది. తమిళనాడులో ఇప్పటికే వైద్యులు దీన్ని కరోనా రోగులకు సూచించారు.