గడిచిన 8ఏళ్ళలో ఎప్పుడూ లేని రీతిలో కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి కారణంగా యావత్ ప్రపంచం స్తంభించిపోవటం, ఎవరిళ్లల్లో వారు ఉండిపోవాల్సి రావటం, వారాల తరబడి సాగుతున్న లాక్ డౌన్, మరింత కాలం కొనసాగుతుందన్న మాట వినిపిస్తున్న వేళ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడం కోసం లాక్ డౌన్ అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో చాలామంది ఉద్యోగస్తులు మరియు మహిళలు ఇళ్లలోనే ఉండటంతో దాదాపు 70 లక్షల మంది మహిళలు గర్భవతులు అయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తన తాజా పరిశోదనలో తేలినట్టు చెప్పుకొచ్చింది.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మరియు గర్నమెంట్ ఉద్యోగస్తులు అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొనడంతో అప్పట్లో లాక్ డౌన్ సమయంలో కండోమ్ లు బాగా అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పడు కొంత మంది మహిళలు గృహహింస కింద లైంగిక దాడులకు గురయి గర్భం ధరించిన వారు కూడా ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి చెప్పుకొచ్చింది. ప్రపంచం మరో ఆరు నెలలు ఈ విధంగానే ఉంటే ఈ సంఖ్య 4.7 కోట్లకు పెరిగే అవకాశం ఉందని, అంతేకాకుండా రాబోయే రోజుల్లో చాలా మహిళలు, బాలికలు లైంగక దాడులకు గురవుతారని తెలిపింది. కాబట్టి ప్రపంచ దేశాల నాయకులు అలర్టుగా ఉండాలని, మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలుగకుండా అన్ని దేశాల ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకొవాలని ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు జారీ చేసింది.