కోవిడ్ డ్యూటీ వేశారని ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ బాలనరసింహారెడ్డి.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కోవిడ్ డ్యూటీ చేయనని మొండికేశాడు. స్టేషన్ లోనే విధులు నిర్వహిస్తానని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలసరసింహారెడ్డిపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నట్లు సీఐ చెబుతున్నారు.

గంజాయి వ్యాపారులతో కుమ్మక్కైయ్యాడని.. భూతగాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నాడని సీఐ ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్ బాలనరసింహారెడ్డి మాత్రం.. తాను సెలవు అడిగితే ఇవ్వకుండా వేధిస్తున్నారని చెబుతున్నాడు. తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని.. అందుకే సెలవు అడిగినట్లు చెబుతున్నాడు.