హైదరాబాద్: దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరగడమే కాదు.. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. సాధారణ ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా కరోనా కాటుకు ఎంతోమంది బలైపోతున్నారు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు (64) కరోనాతో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఇటీవల కరోనా సోకిన రామారావు హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చేరారు. అయితే క్రమంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఈ తరం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు సోదరుడే పోకూరి రామారావు. ఈ తరం ఫిలింస్ బ్యానర్‌లో రూపొందిన పలు చిత్రాలకు ఆయన చిత్ర సమర్పకుడిగా వ్యవహరించారు.