కరోనా లక్షణాలు లేవని దర్జాగా తిరిగే పరిస్థితి లేదు. ఎప్పుడు, ఎవరి నుంచి సోకిందో తెలియకుండానే పలువురు బాధితులుగా మారుతున్నారు. మేడ్చల్‌‌‌‌లో నమోదైన కేసుల్లో 30శాతం ఇలాంటివే ఉన్నాయి. ముందు జాగ్రత్తతో టెస్ట్ ​చేయించుకుంటే తప్ప నిర్ధారణ కావడం లేదు. లింక్ ​తెలియకపోవడం, కాంటాక్ట్‌‌‌‌ ట్రేసింగ్ మరింత సమస్యగా మారింది. జీహెచ్​ఎంసీ, రంగారెడ్డితో పోల్చితే మేడ్చల్ జిల్లాలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా, గత 15 రోజుల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. 4,475 మందికి టెస్టులు చేయగా, 1,357 పాజిటివ్‌‌‌‌ వచ్చాయి. 24మంది చనిపోయారు. జిల్లాలో 2 టెస్టింగ్ సెంటర్లు ఉండగా, చాలామంది పేషెంట్లలో ఎలాంటి లక్షణాలూ ఉండడం లేదని డాక్టర్లు చెప్తున్నారు. సిటీ నుంచి రాకపోకలు చేసే క్రమంలో పబ్లిక్​ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మెరుగైన టెస్టింగ్ ప్రక్రియ లేకనే:

రెవెన్యూ జిల్లాపరంగా మేడ్చల్ వేరే అయినా, కరోనా కేసుల పరిశీలన, పర్యవేక్షణ జీహెచ్ఎంసీ పరిధిలోనే నడుస్తోంది. జిల్లాలో ప్రైమరీ కాంటాక్టుల ట్రేసింగ్​లో జాప్యం, మెరుగైన టెస్టింగ్ ప్రక్రియ లేకపోవడంతో, వైరస్‌‌‌‌ స్ప్రెడ్‌‌‌‌ అవుతోంది. గ్రేటర్ పరిధిలోని ఏరియాల్లోనే ఎక్కువ ఎఫెక్ట్‌‌‌‌ ఉంది.