కరోనా సోకిందనే భయంతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది . పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం .. షాపూర్ నగర్ కు చెందిన ఎలుగుపల్లి సుజాత ( 45 ) అనే మహిళ గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో , కుటుంబ సభ్యులు రక్తపరీక్షలు చేపించగా మలేరియా అని తేలింది . కానీ అప్పటినుండి సుజాత తనకు కరోనా వచ్చిందేమో అని బాధపడుతూ ఉండేదని , కాగా గత రాత్రి అందరూ పడుకున్న సమయంలో సుజాత హాల్ లో పడుకుందని , తాము ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయిఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.