అవాస్తవ వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నెల (మార్చ్) 31 వరకు ఏడుపాయల పుణ్యక్షేత్రం మూసివేత, మెదక్ సి.ఎస్.ఐ. చర్చ్ ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనల నిషేదం : జిల్లా ఎస్.పి. శ్రీమతి. చందన దీప్తి ఐ.పి.ఎస్.

ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి కరోన వైరస్ ను నివారించడములో భాగంగా తెలంగాణ ప్రజలు ఇట్టి కరోన వైరస్ బారిన పడకుండగా ఉండేందుకు ప్రభుత్వ సూచనల ప్రకారము జిల్లా పోలీసు యంత్రాంగము ఎప్పటి కప్పుడు పటిష్టమైన చర్యలను తీసుకోవడము జరుగుతుందని, ఇట్టి చర్యలలో భాగంగానే జిల్లా పోలీస్ అధికారులు అందరూ కూడా అన్నీ గ్రామాలల్లో వైరస్ వ్యాప్తి నివారణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పిస్తున్నారని, అదే విధంగా జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రజలు బయటకు వచ్చేటపుడు మాస్కూలు ధరించారలని, అలాగే ప్రజా ఆరోగ్యం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల అనగా మార్చ్ 31 వరకు ఏడుపాయల పుణ్యక్షేత్రం మూసివేయడం జరిగినదని ఆలయ ఈ.వో. శ్రీ. శ్రీనివాస్ గారు తెలుపడం జరిగినది, అలాగే సి.ఎస్.ఐ. చర్చ్ ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనల నిషేదిస్తున్నట్లు మెదక్ సి.ఎస్.ఐ. చర్చ్ బిషప్ శ్రీ ఎ.సి. సల్మోన్ రాజ్ గారు తెలుపడం జరిగినదని, అదేవిధంగా జిల్లా ప్రజలు మసీదులలో, దేవాలయాలలో, చర్చ్ లలో మరియు ఇతర మతాల దేవాలయాలలో, గుళ్ళలో భక్తులు అధిక సంఖ్యలలో పాల్గొనడం, ప్రార్థనలు చేయడంలాంటివి చేయకూడని, ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడడం వలన ఈ కరోన వ్యాప్తి చెందే అవకాశం వున్నందున ప్రజలు ఇట్టివిషయంలో తమకు సహకరించి తమ తమ ఇండ్లలోనే వుండాలని జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు కోరారు.

అలాగే ఎటువంటి సమావేశాలు, ర్యాలీలు తీయకూడదని, అన్నీ మతాల కుల పెద్దలతో మాట్లాడి కరోన వైరస్ నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక భాద్యతను తీసుకొని ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఎవరికైన అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్యకేంద్రం నందు చికిత్స పొందాలని, ఎవరు కూడా ఇట్టి విషయములో బయపడుతూ అపోహలకు గురికావొద్దని, స్వంత పరిశుభ్రత, నివారణ చర్యలను తీసుకోవడము వలన కరోన బారిన పడకుండా తమను తాము రక్షించుకోగలమని, కావున తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్.పి. గారు కోరారు.

సామాజిక మధ్యమాలలో వస్తున్న వార్తల పట్ల జాగ్రత్తగా వుండాలని, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం, పోలీసు శాఖ చేస్తున్న కృషికి సహకరించాలని కోరారు. ప్రజారోగ్యం విషయంలో పూర్తి జాగ్రత్తగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖ 24 X 7 సేవలందింస్తోందని, కావున దయచేసి జిల్లా ప్రజలంతా దీనిని గమనించి తప్పుడు వార్తలు, ప్రచారాలు నమ్మవద్దని మెదక్ జిల్లా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో కరోనా వైరస్ వ్యాపించిందని, ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజల్లో ఆందోళన సృష్టించి భయాందోళనకు గురిచేస్తున్న వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్- 2005(ఎన్‌డీఎమ్‌ఏ యాక్ట్‌ సెక్షన్‌ 54 ) ప్రకారం కేసును నమోదు చేయడం జరుగుతుందని, ఒక సంవత్సరం పాటు శిక్షార్హులు అవుతారని మరియు జరిమానా కూడా విధించడం జరుగుతుందని జిల్లా ఎస్.పి. గారు శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. ఈ సంధర్భంగా హెచ్చరించారు,

ఇందులో భాగంగా జిల్లాలో కరోనా వ్యాధి వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో తప్పడు వార్తలు ప్రచారం చేసిన వారిపై ఇప్పటి వరకు మెదక్ టౌన్ పి.ఎస్.లో సాయిబాబా గౌడ్ ని మరియు చేగుంట పి.ఎస్.లో సుధాకర్, ఆనంద్ లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగినదని ఈ సంధర్భంగా తెలిపారు. కాబట్టి సోషల్ మీడియాలో మరియు ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తప్పడు వార్తలు, అవాస్తవ వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను అనవసరంగా భయాందోళనలకు గురిచేయడం లాంటివి చేయకూడదని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి. గారు హెచ్చరించారు.