ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో 32ఏళ్ల వివాహిత 30ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అయితే మహిళపై కోపంతో ఆ యువకుడు వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తన ప్రియుడు పెళ్లి చేసుకున్నాడు అని తెలుసుకున్న ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మహిళ తన ప్రేమికుడితో గొడవకు దిగింది. భార్యకు విడాకులు ఇచ్చి తనతో ఎఫైర్ కొనసాగించాలని కోరింది. ఈ గొడవల మధ్య ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకుని చనిపోవడానికి నదిపై ఉన్న వంతెనపైకి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రియురాలు నదిలో దూకినప్పటికీ ప్రేమికుడు దూకలేదు. మహిళ నదిలోకి దూకగానే అక్కడి నుంచి పరారయ్యాడు. దీన్ని గమనించిన మహిళ ఈదుకుంటూ ఒడ్డకు వచ్చింది. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన ప్రియుడిపై కేసు పెట్టింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు, ఓ వివాహితుడు మరియు అతనితో ఎఫైర్ కొనసాగిస్తున్న మహిళను వివస్త్రను చేసి గ్రామంలో నడిపించారు. జూన్ 11న ఛత్తీస్‌గఢ్‌ లోని కొండగావ్ జిల్లా ఉరిందబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంః

జూన్ 11న ఉరిందబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో పెళ్లాం ఊరెళ్లిందని భావించిన ఓ వ్యక్తి ప్రేయసిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపారు. అయితే భార్య టూర్ క్యాన్సిల్ అయి ఇంటికి తిరిగొచ్చింది. ఇంట్లో తన భర్త మరో మహిళతో నగ్నంగా ఉండటాన్ని గమనించిన ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన భర్త మరో మహిళతో గదిలో శృంగారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వెంటనే ఆ మహిళ బంధువులు, గ్రామంలోని కొందరికి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న బంధువులు, గ్రామస్తులు గదిలో శృంగారం చేస్తోన్న వారిద్దరినీ బయటకు లాక్కొచ్చి ఇద్దరినీ చితకబాది వారి బట్టలు ఊడదీసి అర్థనగ్నంగా గ్రామంలో ఊరేగించారు. గ్రామంలోని కొందరు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కి చేరుకున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసు బృందాన్ని గ్రామానికి పంపి విచారణ చేపట్టామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వ్యక్తి భార్యతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.