అలీపుర్ దౌర్ జిల్లా కలెక్టర్ జులుం- పోలీస్ స్టేష‌న్ లోనే యువ‌కుడిపై దాడి- భార్యపై అసభ్య పోస్టింగ్ లకు ఆగ్రహం… Video ?

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఐఏఎస్ అధికారి, అలీపుర్ దౌర్ జిల్లా కలెక్టర్ నిఖిల్ నిర్మ‌ల్ విచ‌క్ష‌ణ కోల్పోయారు. నిఖిల్ భార్యపై ఫేస్ బుక్ లో ఓ యువ‌కుడు అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో క‌లెక్ట‌ర్ ఆ యువ‌కుడిని పోలీసు స్టేషన్ కు పిలిపించి, అతన్ని దారుణంగా కొట్టారు. ఎటువంటి ఫిర్యాదు చేయకుండానే విచారణ పేరిట యువకుడిని చిత్ర హింసలు పెట్టారు. ఆ యువకుడు తనను క్షమించాలని ప్రాధేయ పడుతున్నా నిఖిల్ నిర్మల్, ఆయన భార్య వినలేదు.

పోలీసులు చూస్తుండ‌గానే క‌లెక్ట‌ర్ ఆ యువ‌కుడి ద‌వ‌డ‌లు ప‌గ‌ల‌కొట్టారు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో పోలీసు చిత్రీకరిండంతో ఈ వీడియో బైట ప‌డింది. యువకుడిని కొట్టిన కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్ర‌జా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. త‌ప్పు చేసిన వ్య‌క్తిపై కేసు న‌మోదు చేసి పోలీసుల‌కు అప్ప‌గించాలి కానీ, బాధ్యతాయుత‌మైన ప‌ద‌విలో వుండి, ఆద‌ర్శంగా వుండాల్సిన క‌లెక్ట‌ర్ ఇలా దాడి చేయ‌డం త‌ప్ప‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.