పురపాలికలో పోటీ చేస్తున్న ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు వేర్వేరు పార్టీల్లో చేరారు. ఈ మేరకు 19వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొలిపాక సమ్మయ్య మంత్రి ఈటల రాజేందర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. దీంతో గులాబీ కండువా కప్పి అతన్ని పార్టీలోకి ఆహ్వానించారు. తాను పోటీ నుంచి విరమించుకొని తెరాస అభ్యర్థి గోస్కుల రాజుకు మద్దుతుగా ప్రచారం చేస్తానని వెల్లడించారు. ఈ వార్డులో తెరాస అభ్యర్థితో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నారు.

భాజపాలో చేరిన మరో కాంగ్రెస్‌ అభ్యర్థి

హుజూరాబాద్‌లోని 22వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రగిరి కుమార్‌ భాజపా కోర్‌ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో అతనికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాను పోటీ నుంచి తప్పుకుని, భాజపా అభ్యర్థి పైల వెంకటరెడ్డి తరఫున ప్రచారం చేస్తానని వెల్లడించారు.