తండ్రి కాంగ్రెస్ నేత, కూతురేమో భాజపా తమిళనాడు నేతగా ఉంటూ తెలంగాణ గవర్నర్‌ అయిన తమిళసై సౌందరాజన్‌. ఆమె తండ్రి కుమారి అనంతన్‌ తమిళనాడులో జరగబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తిరునల్‌వేలి జిల్లా నంగునేరి స్థానం నుంచి ఆయన టికెట్‌ ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా డీఎంకే ఈ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించింది.

అనంతన్‌ సోదరుడు, నంగునేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వసంతకుమార్‌ లోక్‌సభకు ఎన్నికవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. అనంతన్‌ గతంలో టీఎన్‌పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన అభ్యర్థిత్వం ఖరారు కానప్పటికీ టీఎన్‌పీసీసీ అధ్యక్షుడు అళగిరి కూడ అనంతన్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తమిళనాడులోని నంగునేరి, విక్రవాండి స్థానాలకు అక్టోబర్‌ 21న ఉపఎన్నిక జరగనుంది.