{"subsource":"done_button","uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1609604426879","source":"other","origin":"gallery","source_sid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1609606415560"}

జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ని వరంగల్ కేంద్ర కారాగారంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రేడ్డి నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ములాకత్ తో కలిశారు. ఉత్తమ్ కుమార్ రేడ్డి మాట్లాడుతూ: తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పోలీసుల వేధింపులకు / దారుణానికి వ్యతిరేకంగా తాము నిరంతరం పోరాడుతామని కెప్టెన్ ఉత్తమ్ చెప్పారు. తప్పుడు కేసులపై కాంగ్రెస్ నాయకులను జైలులో పెట్టడం ద్వారా కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు టిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలను రక్షించడానికి మేము పోరాడతామని, త్వరలో జైలు భరో ఆందోళనకు ప్రణాళిక వేస్తామని ఆయన చెప్పారు.

మాజీ ఎమ్మెల్సి కొండా మురళి కామెంట్స్:

  • ఎర్రబెల్లి దయాకర్ రావు రేషన్ డీలర్ గా ఉన్నప్పుడే కొండా సురేఖ ఎమ్మెల్యే చేసి మంత్రి గా కూడా చేసిన.
  • రానున్న రోజుల్లో జంగా రాఘవరెడ్డి ని ఎమ్మెల్యేగా చేసే బాధ్యత నాదే.
  • 25 సంవత్సరాల క్రితం నాపై కేసులు పేట్టి ఇదే జైలుకు పంపించారు ఇప్పుడు జంగా రాఘవ రెడ్డి పై అదే కేసులు పెట్టి జైల్ కి పంపించారు.
  • రాఘవ రెడ్డి ని ఎమ్మెల్యే చేయాడం ఖాయం..

డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కామెంట్స్:

  • పోలీసులకు పోస్టింగ్స్ కావాలంటే 10 లక్షలు స్థానిక ఎమ్మెల్యే కి ఇచ్చి 50 60 లక్షలు సంపాదించుకుని పోతున్నారు
  • పోలీసులు ఎంత అవినీతి కి పాల్పడుతున్నారు ఇప్పటికే ఇద్దరు సిఐలు సస్పెండ్ చేసిన ఘనత వరంగల్ సిపి ప్రమోద్ కుమార్ కు ఉంది.
  • కాంగ్రెస్ కార్యకర్తలపై తెలంగాణ ప్రభుత్వం పోలీసుల సహకారంతో అక్రమ కేసులు బనాయించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు