వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మాజీ కాంగ్రెస్ శాసనసభ్యుడు కొండేటి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా క్రియాశీలకంగా పనిచేసి, వర్ధన్నపేట గ్రామ సర్పంచిగా,వర్ధన్నపేట నియోజకవర్గం నుండి వైయస్ హయాంలో కొండేటి శ్రీధర్ 2009లో ఎమ్మెల్యే గెలిచి 5 సంవత్సరాలపాటు శాసనసభ్యుడిగా పనీచేశాడు. అనంతరం 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆరూరి రమేష్ పై ఓటమి చెందాడు. 2019 ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మరో సారి టికెట్ ఆశించిన కానీ, వర్ధన్నపేట టికెట్ మహా కూటమికి చెందిన జన సమితి పార్టీకి చెందిన అభ్యర్థికి రావడంతో తీవ్ర అసంతృప్తి చెందాడు. సరైన గుర్తింపు లేకపోవడంతో పాటు బిజేపీ అగ్ర నేతలు భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయనే హామీతో పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ వివేక్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు కొండేటిని బీజేపీలోకి చేరే విధంగా చేశాయని, పార్టీ వర్గాలు భావిస్తున్నాయి…