ఎన్నికలలో ఓడిపోయిన దగ్గర నుండి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ రాజకీయాలలో అంతగా యాక్టీవ్ గా లేరు. తాజాగా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్ధం పుచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఆయన బీజేపీలో చేరుటకు రంగం సిద్ధం చేసుకున్నారు. అమిత్ షా హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు.కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు దామోదర రాజనరసింహ డిప్యూటీ సీఎంగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈయన 2014 లోనే బీజేపీలో చేరుతారనే వార్తలు వచ్చాయి. అప్పుడు ఆ ప్రతిపాదనను విరమించుకున్న ఆయన ఇప్పుడు బీజేపీలో చేరుతుండడంతో కాంగ్రెస్ కి పెద్ద దెబ్బె అని చెప్పవచు.