కాజీపేటలోని పిజిఆర్ అపార్ట్మెంట్ తో పాటు కమిషనరేట్ పరిధిలో మరియు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన ఒక నిందితుడిని కాజీపేట పోలీసులు శనివారం అరెస్టు చేయగా ఈ ముఠాలోని మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుండి 21లక్షల 68వేల రూపాయల విలువగల 404 గ్రాముల బంగారు. మూడు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్లు, 9వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.