కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీగా ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు వలసలు వస్తున్నారు. వీరు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా మరియు ఉత్తర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం అన్ని సామాన్లు వెంట బెట్టుకొని, తమ తమ కుటుంబాలతో తెలంగాణ రాష్ట్రానికి భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడ వీరు వ్యవసాయ, భవన నిర్మాణ, దినసరి కూలీలుగా వేసవి అంతా ఇక్కడే ఉండి, ఆ తర్వాత తమ స్వరాష్టాలకు వెళ్ళిపోతారు.