బైక్ ఆపలేదని కానిస్టేబుల్ ఓ వ్యక్తిని చితకబాదాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం జరిగింది. జయశంకర్ భూపాలపల్లికి చెందిన గుగ్గిల నాగేశ్వరరావు తన భార్య కూతురుతో కలిసి కోటంచ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా మధ్యలో భూపాలపల్లి పోలీసులు వాహనాలు చెకింగ్ చేస్తున్నారు. సివిల్ డ్రెస్ లో ఉన్న ఓ పోలీస్ అధికారి నాగేశ్వరావు వాహనం ఆపండి అని చెయ్ అడ్డం పెట్టాడు. ఎవరో అనుకొని నాగేశ్వరావు బైక్ బ్రేక్ వేయడంతో కొంత దూరం వెళ్లి ఆగాడు.

బైక్ ఆగడంతో సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీస్.. బైక్ అపమంటే అపలేదని నాగేశ్వరావుని చితకబాదాడు. తనను అకారణంగా ఎందుకు కొడుతున్నావని బాధితుడు ప్రశ్నినించగా ..నాకే ఎదురు తిరుగుతావా అంటూ మరోసారి కొట్టాడని కన్నీరుమున్నీరయ్యాడు బాధితుడు. తనను అకారణంగా కొట్టిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని నాగేశ్వరరావు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశాడు.