నాన్నను కొట్టొద్దు అంకుల్ ప్లీజ్అంటూ కొడుకు కాళ్లా వేళ్లా పడ్డా కనికరించకుండా తండ్రిని చితకబాది పోలీస్ కారులో ఎక్కించుకుని తన్నుకుంటూ స్టేషన్ కు తీసుకుపోయిన కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. కరోనా లాక్ డౌన్ టైమ్ లో కూరగాయలు కొనేందుకు కొడుకుతో కలసి తండ్రి వనపర్తిలో బజారుకి వచ్చాడు. ఓ కానిస్టేబుల్ బండి ఆపాడు, మాటా మాటా పెరిగడంతో కానిస్టేబుల్ ఫ్రస్టేషన్ కి లోనై.. బైకిస్ట్ పై చేయిచేసుకున్నాడు.

పక్కనే ఉన్న కొడుకు, అంకుల్ ప్లీజ్ నాన్నను కొట్టొద్దు అని వేడుకున్నా వినకుండా బూతులు తిడుతూ వాళ్లిద్దర్నీ కారులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మంత్రి కేటీఆర్ స్వయంగా డీజీపీతో మాట్లాడారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వ రావు స్వయంగా బాధిత కుటుంబాన్ని కలసి భరోసా ఇచ్చారు.