శృంగారానికి ఏ మాత్రం అనువైన చోటు దొరికినా తమ కోరికను తీర్చుకుంటుంటారు కొందరు. ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఇంకా చెప్పాలంటే ఓ జంట చేసిన పని అక్కడి పోలీసులకే షాక్ ఇచ్చింది. తమ కారులోనే జంట శృంగారానికి పాల్పడటం చూసి అక్కడి పోలీసులు అవాక్కయ్యారు.

వివరాళ్లోకి వెళ్లితే: మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టిస్తున్నారనే ఆరోపణల కారణంగా ఓ జంటను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి బ్రీత్ అనలైజర్ టెస్టులు చేసి తమ కారులోనే పోలీస్ స్టేషన్‌కు తరలించబోయారు. అయితే మధ్యలో కొద్దిసేపు కారు ఆపి బయటకు వచ్చిన పోలీసులు తిరిగి కారు ఎక్కగానే ఆ జంటను చూసి షాక్ అయ్యారు. కారులో శృంగారం చేసుకుంటున్న వారిని వారించబోయారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ జంట పోలీసుల మాట వినలేదు. దీంతో బలవంతంగా ఇద్దరిని కారు నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో పాటు తమ కారులో శృంగారానికి పాల్పడిన అంశాన్ని కూడా చార్జ్‌షీట్‌లో నమోదు చేశారు. ఈ కారణంగా వారికి శిక్ష పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు….