కిడ్నీ సమస్య తీవ్రం కావడంతో హీరో రానా ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లారని సమాచారం. కొంతకాలంగా రానా తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గతంలో ఓసారి ఆపరేషన్ అవసరమని డాక్టర్లు సూచించినా, తర్వాత మందులతో నయం అవుతుందని పంపించేశారు. తీరా ఇప్పుడు మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో మరోసారి డాక్టర్లు రానాకు వైద్యపరీక్షలు నిర్వహించారు. గతంలో రానా మేనత్త, రానా తల్లి ఇద్దరూ కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు కిడ్నీ మార్పిడి అనివార్యం కావడంతో అమెరికాలోనే రానాకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయబోతున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరుగుతుందని తెలుస్తోంది.